సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 జనవరి 2022 (15:37 IST)

ఏపీ సర్కారు రైతులకు గుడ్ న్యూస్.. ఏంటది?

ఏపీ సర్కారు రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. మూడో విడతలో మొత్తం 50,58,489 మంది రైతుల ఖాతాల్లో రూ.1,036 కోట్లు జమ చేయనున్నారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం వైఎస్‌ జగన్.
 
2021-22 సీజన్‌లో రూ.6,899.67 కోట్లు జమ కానుండగా, గడిచిన మూడేళ్లలో ఈ పథకం కింద రూ.19,812.79 కోట్లు పెట్టుబడి సాయం అందించింది సర్కార్.. వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు.