శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 19 అక్టోబరు 2023 (13:33 IST)

ఏపీ ప్రజలకు శుభవార్త - బ్యాంకు ఖాతాల్లో రూ.10 వేలు జమ

jagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. గురువారం అర్హులైన వారి బ్యాంకు ఖాతాల్లో రూ.10 వేలు జమ చేయనున్నట్టు తెలిపారు. ఇందుకోసం కొత్తగా ఏపీ ప్రభుత్వం మరో ప్రభుత్వానికి శ్రీకారం చుట్టుంది. జగనన్న చేదోడు పథకం నాలుగో విడత ఆర్థకి సాయం అందించాలని సీఎం జగన్ రెడ్డి నిర్ణయించుకున్న విషయం తెల్సిందే. 
 
ఇందులోభాగంగా, ఆయన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగే కార్యక్రమంలో పాల్గొని, అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లో రూ.10 వేలు జమ చేశారు. ఇందుకోసం ప్రభుత్వం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని వైడబ్ల్యూసీఎస్ మైదానంలో సీఎం సభా కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. 
 
ఈ పథకం కింద ఏపీ ప్రభుత్వం మొత్తం 3.25 లక్షల మంది అర్హులైన రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ లబ్దిదారులకు రూ.10 వేలు చొప్పున జగనన్న చేదోడు పథకం కింద నగదు జమ చేయనున్నారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం రూ.325.02 కోట్లను ఖర్చు చేయనుంది.