ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 మార్చి 2017 (12:05 IST)

జగన్‌కు యావజ్జీవ శిక్ష ఖాయమని పుల్లారావు జోస్యం.. ఉసిగొల్పింది బాబేనన్న రోజా..

వైపాకా అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి యావజ్జీవ శిక్ష పడటం ఖాయమని ప్రత్తిపాటి పుల్లారావు జోస్యం చెప్పారు. జగన్‌కు కలలో కూడా జైలే కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. అందుకే ఎవరు కనిపించినా జైలుకు పంపుతానని

వైపాకా అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి యావజ్జీవ శిక్ష పడటం ఖాయమని ప్రత్తిపాటి పుల్లారావు జోస్యం చెప్పారు. జగన్‌కు కలలో కూడా జైలే కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. అందుకే ఎవరు కనిపించినా జైలుకు పంపుతానని బెదిరిస్తున్నాడని పుల్లారావు సెటైర్లు విసిరారు.

జగన్ చేసిన తప్పులకు కోర్టులు ఆయనకు జీవితకాలం శిక్ష విధిస్తాయని, తమిళ రాష్ట్రంలో అక్రమాస్తుల కేసులో శశికళకు పట్టిన గతే ఏపీలో జగన్‌కు పడుతుందని హెచ్చరించారు. గుంటూరు జిల్లాకు సీఎం చంద్రబాబు ఎంతో చేస్తున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని సీట్లూ గెలిచి ఆయనకు బహుమతిగా ఇవ్వాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
 
ఇదిలా ఉంటే.. కలెక్టర్‌తో జరిగిన వాగ్వాదం నేపథ్యంలో జగన్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయడాన్ని వైకాపా శ్రేణులు తీవ్రంగా నిరసిస్తున్నాయి. ఇందుకు వ్యతిరేకంగా ఆపార్టీ నేతలు, రోజా, భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి బుద్ది చెప్పడం ఖాయమని ఎమ్మెల్యే రోజా తేల్చి చెప్పారు.ఈరోజుల్లో ఒక పక్షినో, జంతువునో హింసిస్తేనే కేసులు పెడుతున్నారని, అలాంటిది 11మంది మృతికి కారణమైన దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం మీద కేసులు ఎందుకు పెట్టడం లేదని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. 
 
తనకు అనుకూలంగా పనిచేసే కలెక్టర్‌ను, అధికారులను ఉద్దేశపూర్వకంగానే సీఎం చంద్రబాబు జగన్‌పై ఉసిగొలిపారని రోజా ఆరోపించారు. జగన్ మీడియాతో మాట్లాడుతుంటే.. ఆయన వద్దకు వెళ్లి మరీ దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం కలెక్టర్ కు ఏమొచ్చిందని రోజా ప్రశ్నించారు. ఇదంతా చంద్రబాబు డ్రామా అని రోజా తెలిపారు.