బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 4 ఆగస్టు 2017 (13:15 IST)

ఆఫీసుల్లో 'పెద్దలు' చేస్తున్న పనేంటో తెలుసా?

ప్రభుత్వ కొలువుల కోసం కార్యాలయాలకు వెళ్లే పెద్దలు తాము చేస్తున్న నిర్వాహకం ఏంటో తెలిస్తే ప్రతి ఒక్కరూ విస్తుపోవాల్సిందే. ప్రభుత్వ కార్యాలయాల్లో రోజువారీ పనులను పక్కనబెట్టి... ఎంచెక్కా పోర్న్ మూవీలు, ఆ

ప్రభుత్వ కొలువుల కోసం కార్యాలయాలకు వెళ్లే పెద్దలు తాము చేస్తున్న నిర్వాహకం ఏంటో తెలిస్తే ప్రతి ఒక్కరూ విస్తుపోవాల్సిందే. ప్రభుత్వ కార్యాలయాల్లో రోజువారీ పనులను పక్కనబెట్టి... ఎంచెక్కా పోర్న్ మూవీలు, ఆన్‌లైన్ పేకాట, గేమ్స్ ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ముఖ్యంగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది.
 
సాధారణంగా వ్యాపారులు, వ్యవసాయదారులు, ఇతరులు పేకాట ఆడేవారు. కానీ నేడు నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన ఉద్యోగులే పేకాటల్లో మునిగి తేలుతున్నారు. ప్రభుత్వ భవనాలను పేకాట స్థావరాలుగా మారుస్తున్నారు. ఇటీవల ఏలూరులోని రెవెన్యూ భవన్‌లో ఒక తహసీల్దారు, జిల్లా రెవెన్యూ నాయకుడి సహా మరి కొంతమంది పేకాట ఆడుతూ పట్టుపడటం సంచలనం కలిగించింది.
 
ఏలూరులోని జిల్లా పరిషత్‌ గెస్ట్‌ హౌస్‌లో పేకాట ఆడుతూ మరికొందరు పట్టుపడ్డారు. ఇలా జిల్లాలోని పలుచోట్ల కొంతమంది ఉద్యోగులు తమ విధులను పక్కనపెట్టి పేకాటపై దృష్టి పెడుతున్నారు. ఎంతో బాధ్యతగా ఉండాల్సిన ఉద్యోగుల్లో కొంతమంది పేకాటలో మునిగి తేలుతుండటం వల్ల అందరికీ చెడ్డపేరు వస్తోందని సాటిఉద్యోగులు ఆవేదనకు గురవుతున్నారు.