పంట సంరక్షణకు గుంటూరు రైతు వినూత్న ఆలోచన!
గుంటూరు జిల్లాలో ఓ యువరైతు అడవి పందుల బారి నుంచి తన పంటను కాపాడుకోవటానికి సరికొత్తగా ఆలోచించాడు. పొలంలో వాయిస్ రికార్డర్ మైకులో తన వాయిస్‌ని రికార్డు చేసి రాత్రి వేళల్లో రికార్డర్‌ను చెట్టుకు కట్టి వినిపిస్తూ వాటి బెడద నుంచి పంటను రక్షించుకుంటున్నాడు.
అడవి పందుల బెడద నుంచి పంటను కాపాడుకోవటానికి గుంటూరుకు చెందిన ఓ యువరైతు వినూత్నంగా ఆలోచించాడు. ఉడిజర్ల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్‌రెడ్డి తన రెండెకరాల కంది పంటను కాపాడుకోవటానికి వెయ్యి రూపాయలు వెచ్చించి రికార్డింగ్ మైక్‌ను కోనుగోలు చేశాడు.
అందులో తన వాయిస్ నిక్షిప్తం చేసి రాత్రి వేళల్లో పొలం వద్ద దానిని ఓ చెట్టుకు కట్టి ఉంచుతున్నాడు. దాని నుంచే వచ్చే శబ్ధం కారణంగా అటు వైపు అడవి జంతువులు రాకుండా తన పంట సురక్షింతంగా కాపాడుకోగలుగుతున్నాడు.