శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 మార్చి 2020 (11:26 IST)

నిత్యవసర వస్తువుల జాబితాలో రొయ్యలు..

అమలాపురం, మలికిపురం, ఉప్పాడ, తొండంగి, తాళ్లరేవు, కాట్రేనికోన వంటి ప్రాంతాల్లో చిన్నచిన్నగా కొనుగోలు చేసే రొయ్యల కేంద్రాలు సైతం లాక్‌డౌన్‌తో మూతపడ్డాయి. వీటి ద్వారా రోజుకు కనీసం 5 టన్నుల వరకు రొయ్యలు కొనుగోలు చేస్తారు. 
 
అంతరాష్ట్రాల రవాణా బంద్‌ కావడం, బస్సులు, లారీలు తిరగకపోవడంతో వీరు కొనుగోలు చేసినా సరుకు బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. అయితే రొయ్యలను నిత్యవసర వస్తువుల జాబితాలో చేర్చాలని కోనసీమ ఆక్వా రైతులు కోరారు. 
 
లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపునిస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం ఆక్వా ఎగుమతులు కొనుగోలు చేసే కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు, ఆక్వా ఉత్పత్తులను ఒకచోట నుంచి మరో చోటుకు రవాణా చేసేందుకు ప్రభుత్వం అనుమతిని తాజాగా ఇవ్వడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. వీటిని లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఈ మేరకు సోమవారం జీవో జారీ చేసింది.