శుక్రవారం, 21 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 మే 2024 (10:41 IST)

సంసారం ఎలా సాగుతుందని అడిగేవారు.. పక్కన కూర్చోకపోతే..?

మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కడపడితే అక్కడ జరుగుతున్నాయి. తనిఖీల పేరిట వస్తూ తమను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ సంగారెడ్డి జిల్లాలోని పలు పీహెచ్‌సీలకు చెందిన 21 మంది మహిళా మెడికల్‌ ఆఫీసర్లు 10 రోజుల కింద వైద్యారోగ్య శాఖకు ఫిర్యాదు చేశారు. 
 
ఫోన్‌ చేసి మరీ సంసారం జీవితం ఎలా సాగుతుందంటూ అభ్యంతరకరంగా మాట్లాడేవారు.. అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. పక్కన కూర్చోమనేవారు.. లేకుంటే పనిపరంగా వేధించేవారని ఫిర్యాదులో మెడికల్ ఆఫీసర్లు ఆరోపించారు. 
 
దీంతో విచారణ అనంతరం లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కామారెడ్డి డీఎంహెచ్‌వో లక్ష్మణ్‌ సింగ్‌, సూపరింటెండెంట్‌ శ్రీనునాయక్‌ను బుధవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు అధికారులపై 354, 354 డీ, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు.