మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (10:52 IST)

మోడీ కోసం కుక్కలాగా ఇల్లిల్లూ తిరిగి ఓట్లడిగాను : హీరో శివాజీ

భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై హీరో శివాజీ ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో భారతీయ జనతా పార్టీకి ఇలా దాడులు చేసే సంస్కృతి లేదని, ఇప్పుడు కొత్తగా ఆ సంస్కృతిని తీసుకొచ్చారని విమర్శించారు. బుధవారం విజయవాడలో

భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై హీరో శివాజీ ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో భారతీయ జనతా పార్టీకి ఇలా దాడులు చేసే సంస్కృతి లేదని, ఇప్పుడు కొత్తగా ఆ సంస్కృతిని తీసుకొచ్చారని విమర్శించారు. బుధవారం విజయవాడలో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. 
 
తనకు ఆర్ఎస్ఎస్ సోదరులతోనూ పరిచయాలు ఉన్నాయని, గతంలో ఎన్నడూ క్రమశిక్షణ తప్పని వారు ఇప్పుడు ఇలా ఎందుకు అసహనాన్ని పెంచుకుంటున్నారని ప్రశ్నించారు. ఇదా భారతీయ జనతా పార్టీ? ఇలాగేనా మీరు చేసేది? దమ్ముంటే, మీకు చేతనైతే బీజేపీ వాదనను ప్రజలకు వివరంగా చెప్పాలని, చెప్పలేకుంటే తప్పు ఒప్పుకోండని హితవు పలికారు. 
 
దీంతో ఆయనపై బీజేపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. దీంతో మరింత ఆగ్రహంతో ఆయన మాట్లాడుతూ, 'నాపై ఎగబడినా వెనక్కు పోయే మనిషిని కాను. నామీద జరిగే దాడి తెలుగువాడి మీద జరిగే దాడిగా గుర్తుంచుకోండి. ఇదే భారతీయ జనతా పార్టీ కోసం 2014లో కుక్కలాగా ఇల్లిల్లూ తిరిగి ఓట్లడిగా నేను. మోడీ మా ప్రాంతానికి ప్రత్యేక హోదా ఇచ్చి... ఈ రాష్ట్రాన్ని... అందుకుంటారనీ(ఆ సమయంలో బీజేపీ కార్యకర్తలు మరోసారి ఆందోళనకు దిగారు). 
 
సోదరా... నేనూ బీజేపీలో ఉన్నవాడినే. ఆరోజు మీరెవరూ లేరు. ఇవాళ మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారు. ఏమైనా చేయండి. నామీద దాడి చేయండి చంపండి. కానీ నా చావుకోసమైనా తెలుగువాళ్లంతా ఒక్కటై తిరగబడతారు' అంటూ బీజేపీ కార్యకర్తలపై హీరో శివాజీ నిప్పులు చెరిగారు.