శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (12:07 IST)

పవన్ తలుచుకుంటే ప్రత్యేక హోదా వస్తుంది : నటుడు శివాజీ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి అందరినీ చైతన్యవంతులు చేయడం సంతోషంగా ఉంది. ఆయన ముందుకు కదిలి మాలాంటి వారిని దగ్గరుండి తీసుకెళితే పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి అందరినీ చైతన్యవంతులు చేయడం సంతోషంగా ఉంది. ఆయన ముందుకు కదిలి మాలాంటి వారిని దగ్గరుండి తీసుకెళితే పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఒక్కడినే కాదు ఎంతోమంది పవన్ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారని హీరో శివాజీ అంటున్నారు. ఇక వేచి చూసే ధోరణి లేదని నేరుగా కేంద్రంపైన యుద్ధానికి సిద్ధమవుతున్నామని ఆయన పిలుపునిచ్చారు. 
 
రాజకీయాలను పక్కనబెట్టి అందరూ కలిసి రావాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ బాధపడుతున్న వారెవరైనా సరే ముందుకు వచ్చి పోరాటానికి కలిసి రావాలన్నారు. ప్రధాని మోడీ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదాను సాధించుకుని తీరుతామన్న నమ్మకం తనకుందన్నారు. పవన్ దూకుడు చూస్తే ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధించుకుని తీరుతామన్న నమ్మకం ధృఢంగా కలుగుతుందన్నారు.