శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 17 ఫిబ్రవరి 2018 (11:37 IST)

సింహంలా వున్న పవన్.. చిరంజీవిలా మారిపోతున్నారు: రామ్ గోపాల్ వర్మ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవిపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో విమర్శలు గుప్పించాడు. ఒకప్పుడు పవన్ కల్యాణ్ సింహంలా వున్నారని.. ప్రస్తుతం చిరంజీవిలా మారిపోతున్నారని వర

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవిపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో విమర్శలు గుప్పించాడు.

ఒకప్పుడు పవన్ కల్యాణ్ సింహంలా వున్నారని.. ప్రస్తుతం చిరంజీవిలా మారిపోతున్నారని వర్మ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో గొప్ప ఆత్మస్థైర్యంతో అన్ని నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ పార్టీ పోటీ చేయాలని... లేకపోతే ఆయన సోదరుడు చిరంజీవి కన్నా పెద్ద తప్పు చేసినవాడవుతారని వర్మ వ్యాఖ్యానించాడు. 
 
హైదరాబాద్ నొవోటెల్‌లో జనసేన పార్టీని ప్రారంభించిన సమయంలో పవన్ కల్యాణ్ ఓ సింహంలా కనిపించారని, ఆయన మాటలు సింహ ఘర్జనను తలపించాయని.. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఆయన చిరంజీవిలా మారిపోతున్నట్లున్నారని వర్మ చెప్పుకొచ్చారు. చిరంజీవిలా పవన్ కల్యాణ్ మారిపోక ముందే ఏపీ ప్రజలు మేల్కొనాలని... లేకపోతే ప్రజారాజ్యం కన్నా దారుణంగా జనసేన తయారవుతుందని చెప్పుకొచ్చారు.