సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2018 (18:04 IST)

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో థర్డ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ ఏది?

టాలీవుడ్‌‌లో సంక్రాంతికి రిలీజ్ అయిన చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి' చిత్రం ఉంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్

టాలీవుడ్‌‌లో సంక్రాంతికి రిలీజ్ అయిన చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి' చిత్రం ఉంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రం విడుదలకు ముందు రూ.125 కోట్ల బిజినెస్‌ చేసింది. రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద బోల్తాపడి కేవలం రూ.57.5 కోట్ల షేర్‌ను మాత్రమే సాధించింది. అంటే 46 శాతం మాత్రమే రాబట్టింది. 
 
విచిత్రం ఏమంటే నిర్మాతలకు లాభసాటిగా నిలిచిన ఎన్నో భారీ చిత్రాలు కొన్నవాళ్ళకు మాత్రం కొరకరాని కొయ్యలుగా మిగిలిపోతున్నాయి. ఇలాంటి జాబితాలో 'అజ్ఞాతవాసి' ఒకటి కాగా, మహేశ్ 'స్పైడర్', 'బాంబే వెల్వెట్' చిత్రాలు ఉన్నాయి. ఈ మూడు చిత్రాలు ఇండియాస్ బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీస్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. వీటిలో మొదటి స్థానాన్ని 'బాంబే వెల్వెట్' దక్కించుకోగా, ద్వితీయ స్థానంలో 'స్పైడర్', థర్డ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా 'అజ్ఞాతవాసి' చిత్రాలు నిలిచాయి.