UP: డబుల్ డెక్కర్ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం (video)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. లక్నోలోని మొహన్‌లాల్‌గంజ్ సమీపంలో గల కిసాన్‌పథ్ వద్ద ఢిల్లీ నుంచి బీహార్ వెళ్తున్న ఓ డబుల్ డెక్కర్ బస్సులో సడెన్‌గా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో డోరు వైపు ఉన్నవారు త్వరగానే బయటకు రాగలిగారు కానీ, వెనుకవైపు ఉన్నవారికి ఎమర్జెన్సీ డోరు తెరుచుకోకపోవడంతో బయటకు రాలేకపోయారు.
తెల్లవారుజాము సమయం కావటంతో ప్రయాణికుల్లో చాలా మంది నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో ప్రమాదం జరగడంతో ఐదుగురు మరణించారు. ప్రయాణిస్తున్న బస్సులో అకస్మాత్తుగా పొగ వ్యాపించడంతో ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు.
భయాందోళనతో ఏం చేయాలో తెలియక ఆందోళనకు గురయ్యారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 60 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.