సోమవారం, 7 ఏప్రియల్ 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 ఏప్రియల్ 2025 (12:12 IST)

హార్దిక్ పాండ్యా అదుర్స్.. 16 ఏళ్ల రికార్డు బద్ధలు.. 35 పరుగులిచ్చి 5 వికెట్లు

hardika pandya
ఐపీఎల్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 12 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 203 పరుగులు చేసింది. తరువాత ఆడిన ముంబై జట్టు 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది.
 
ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో కేవలం 35 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఐపీఎల్ క్రికెట్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా నిలిచాడు. ఆర్‌సిబి మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే పేరిట ఉన్న 16 ఏళ్ల రికార్డును కూడా పాండ్యా బద్దలు కొట్టాడు.
 
2010లో నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో డెక్కన్ ఛార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సిబి మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే 3.3 ఓవర్లలో 16 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా 5 వికెట్లు పడగొట్టడం ద్వారా ఈ రికార్డును బద్దలు కొట్టాడు.