ఐపీఎల్ తొలి జట్టుగా కేకేఆర్ సరికొత్త రికార్డు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గురువారం హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 80 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో కేకేఆర్ జట్టు ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. టోర్నీ చరిత్రలో మూడు జట్లపై 20 అంతకంటే ఎక్కువ విజయాలు సాధించిన జట్టుగా సరికొత్త రికార్డును నెలకొల్పింది.
ఇప్పటివరకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై 20, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై 20, పంజాబ్ కింగ్స్‌పై 21 చొప్పున విజయాలు నమోదు చేసుకుంది. అలాగే, సన్ రైజర్స్‌పై 2023-25 మధ్య వరుసగా 5 మ్యాచ్‌లలో కోల్‌కతా విజయం సాధించడం గమనార్హం.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా 2023-25 మధ్య వరుసగా ఐదు మ్యాచ్‌లలో హైదరాబాద్ జట్టుపై వరుసగా ఐదు మ్యాచ్‌లలో గెలుపొందింది. కాగా, ఐపీఎల్‌లో రన్స్‌పరంగా గురువారం నాటి మ్యాచ్‌లోనే సన్ రైజర్స్‌కు భారీ ఓటమి ఎదురైంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ఏకంగా 80 పరుగులు తేడాతో ఓడిపోయింది.