బుధవారం, 9 ఏప్రియల్ 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 ఏప్రియల్ 2025 (12:30 IST)

ముంబై ఇండియన్స్ బస్సులో జాస్మిన్ వాలియా.. హార్దిక్ పాండ్యా కొత్త ప్రేయసి?

Hardik Pandya
Hardik Pandya
ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్, డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ముంబై ఇండియన్స్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలిచి సీజన్-18లో తొలి విజయాన్ని నమోదు చేసింది. 
 
హార్దిక్ పాండ్యా నటి, సెర్బియన్ మోడల్ నటాషా స్టాంకోవిక్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. గ్రీస్ వెకేషన్‌లో ఫోటోలు, వీడియోలలో ఇద్దరూ ఫోజులివ్వడంతో ఈ పుకార్లు మొదలయ్యాయి. 
 
2025 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో కూడా భారత్ ఆడుతున్న మ్యాచ్ సమయంలో జాస్మిన్ వాలియా టీమిండియా ఉత్సాహపరుస్తూ కనిపించింది. ఆ తర్వాత ఇప్పుడు ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో జాస్మిన్ హార్దిక్ పాండ్యా జట్టు ముంబైని ఉత్సాహపరిచేందుకు చేరుకుంది. 
 
మ్యాచ్ తర్వాత జాస్మిన్ వాలియా ముంబై ఇండియన్స్ జట్టు బస్సు ఎక్కడం కనిపించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత వారి డేటింగ్ గురించి ఊహాగానాలు మరోసారి తీవ్రమయ్యాయి.