సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2018 (16:54 IST)

'పవన్ కల్యాణా..? అతడు ఎవరు'...? బాలకృష్ణ

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, జూ.ఎన్టీఆర్ తదితరులు ఉన్నారు. అయితే, వీరంతా ఒకే వేదికలపై పలుమార్లు కలుసుకున్న సందర్భాలు ఉన్

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, జూ.ఎన్టీఆర్ తదితరులు ఉన్నారు. అయితే, వీరంతా ఒకే వేదికలపై పలుమార్లు కలుసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ బాలకృష్ణకు మాత్రం పవన్ కల్యాణ్ ఎవరో తెలియదట. 
 
జనసేన పార్టీ స్థాపించిన పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో పోటీ చేయనున్నారు. అలాగే, ఒక స్టార్ హీరోగా పవన్‌కు మంచి క్రేజ్ కూడా ఉంది. అలాంటి పవన్ పేరు తెలియని వారంటూ తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ లేరు. 
 
జనసేన తరపున వచ్చే ఎన్నికల్లో తాను అనంతపురం నుంచి పోటీ చేయనున్నట్లు పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించాడు. దీనిపై మీ స్పందనేంటని ఓ విలేకరి బాలయ్యను ప్రశ్నిస్తే, 'పవన్ కల్యాణా..? అతడు ఎవరు..? అతడెవరో నాకు తెలీదు' అంటూ కారును ఎక్కి వెళ్లిపోయాడు. 
 
గత ఎన్నికల్లో టీడీపీకే మద్దతును ఇచ్చిన పవన్ కల్యాణ్ ప్రచారం కూడా చేశారు. ఇలా తమ పార్టీకే ప్రచారం చేసిన వ్యక్తిని బాలకృష్ణ తెలీదని చెప్పడం అక్కడున్న అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి బాలయ్య స్పందనపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.