సంబంధిత వార్తలు
- విపక్ష వైకాపాకు దెబ్బమీద దెబ్బ - బీజేపీలో చేరిన జకియా ఖానం
- కొడాలి నాని నమ్మకద్రోహి.. అసమర్థుడు : వైకాపా నేత ఖాసీ ఆరోపణలు
- Z+ Security: జెడ్ ప్లస్ భద్రత ఇవ్వండి లేదా బుల్లెట్ ఫ్రూఫ్ కారునైనా వాడుకుంటా!
- Vidadala Rajini: విడదల రజినికి మరో ఎదురుదెబ్బ- అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ (video)
- సజ్జల రామకృష్ణారెడ్డి భూదందా నిజమే.. నిగ్గు తేల్చిన నిజ నిర్ధారణ కమిటీ
వైకాపాకు షాక్... మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర రాజీనామా
వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో గట్టి షాక్ తగిలింది. మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర వైకాపాకు రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన తాజాగా పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు.
ఈ క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్తో మాట్లాడించాలని గత మూడు నెలలుగా మాజీ ఎమ్మెల్యేను కోరుతున్నా పట్టించుకోలేదని అన్నారు. అనుచరులతో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని చంద్ర తెలిపారు. కాగా, ఆయన జనసేన లేదా టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక నిర్ణయం వైకాపా చెందిన సీనియర్ నేత, శాసన మండలి డిప్యూటీ చైర్ పర్సన్‌గా వ్యవరించిన జకియా ఖానం తన పదవికి రాజీనామా చేసిన రోజే బీజేపీలో చేరిన విషయం తెల్సిందే. ఆమె రాజీనామాతో వైకాపాను వీడిన ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరుకుంది.
