గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 8 మార్చి 2018 (19:06 IST)

టీడీపీ మంత్రులు కాదు.. వెంకయ్య ఆ పని చేస్తే ప్రత్యేక హోదా ఖాయం : హీరో శివాజీ

ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గం నుంచి టీడీపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేయడం ఎలాంటి ఫలితం ఉండదని సినీ హీరో శివాజీ అభిప్రాయపడ్డారు. అదేపనిని ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు చేస్తే ఖచ

ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గం నుంచి టీడీపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేయడం ఎలాంటి ఫలితం ఉండదని సినీ హీరో శివాజీ అభిప్రాయపడ్డారు. అదేపనిని ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు చేస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. 
 
ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రివర్గంలో నుంచి టీడీపీ మంత్రులు బయటకు రావడం సంతోషకర పరిణామమన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఎవరు తీసుకువస్తారు, ఎవరు హీరోలవుతారనే విషయాలను పక్కనపెడితే .. వెంకయ్య నాయుడు ఒక్కడు కనుక తన పదవికి రాజీనామా చేస్తే ఆరోజున ప్రత్యేకహోదా వస్తుందన్నారు. 
 
ఆయన హీరో కూడా అవుతారు. ఈ విషయం ఆయనకు ఎవరైనా చెప్పినా బాగానే ఉంటుంది. లేదా, రాష్ట్ర ప్రజలకు సహాయం చేసిన వాడిని అవుతానని ఆయన రియలైజ్ అయితే బాగుంటుందన్నారు. ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య నాయుడు రాజీనామా చేయడం వల్ల ఏపీకి అన్యాయంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని, ఇది బీజేపీపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.