బుధవారం, 5 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: సోమవారం, 21 నవంబరు 2016 (16:01 IST)

న‌.మో.కి సంపూర్ణ ఆయుష్షు క‌ల‌గాల‌ని బంద‌రులో హోమం

మ‌చిలీప‌ట్నం : ప‌్ర‌ధాని న‌రేంద్ర మోదీ హ‌త్యకు కుట్ర జ‌రుగుతోంద‌ట‌... న‌ల్ల ధ‌నం వెలికి తీస్తున్న న‌.మోని చంపాల‌ని దుష్ట శ‌క్తులు ప్లాన్ చేస్తున్నాయి. వాటిని జ‌యించే శ‌క్తి మోదీకి క‌ల‌గాల‌ని మ‌చిలీప‌ట్నంలో హోమం చేస్తున్నారు. నల్లధనం వెలికి తీస్తున్న

మ‌చిలీప‌ట్నం : ప‌్ర‌ధాని న‌రేంద్ర మోదీ హ‌త్యకు కుట్ర జ‌రుగుతోంద‌ట‌... న‌ల్ల ధ‌నం వెలికి తీస్తున్న న‌.మోని చంపాల‌ని దుష్ట శ‌క్తులు ప్లాన్ చేస్తున్నాయి. వాటిని జ‌యించే శ‌క్తి మోదీకి క‌ల‌గాల‌ని మ‌చిలీప‌ట్నంలో హోమం చేస్తున్నారు. నల్లధనం వెలికి తీస్తున్న న‌రేంద్ర మోదీకి సంపూర్ణ ఆయుష్షు కలగాలని ఈ హోమంలో సంక‌ల్పించారు. 
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కృష్ణా జిల్లా కేంద్రం మ‌చిలీప‌ట్నంలో ఈ ఆయుష్షు హోమంను శ్రీ గాయత్రీ బ్రాహ్మణ సేవ సంఘం నిర్వ‌హిస్తోంది. త‌న హ‌త్య‌కు కుట్ర జరుగుతోందని, విద్రోహ శక్తుల నుంచి త‌న ప్రాణాలకు ముప్పు ఉందని... అయినా తాను భయపడే ప్రసక్తే లేదని న‌రేంద్ర మోడీ ఇటీవల గోవాలో ప్ర‌క‌టించారు. 
 
మ‌రోప‌క్క మోడీ హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఢిల్లీ పోలీసులకు ఫోన్‌కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు భద్రత పెంచారు. అయినా, ఆ దేవుడు న‌రేంద్ర మోదీకి సంపూర్ణ ఆయుష్ ఇవ్వాల‌ని, దేవుని అనుగ్ర‌హం కోసం హోమం చేస్తున్న‌ట్లు మ‌చిలీప‌ట్నం వాసులు చెపుతున్నారు.