1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శుక్రవారం, 16 మే 2025 (18:18 IST)

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

TSFCC Letter - sunil narang
TSFCC Letter - sunil narang
తెలంగాణ థియేటర్లపై తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని  తెలంగాణ స్టేట్  ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (TSFCC) ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలోని ఎగ్జిబిటర్లు.. సినిమా థియేటర్లు కేవలం షేర్ ఆధారిత వ్యవస్థపైనే నడపాలని నిర్ణయించారని, అలాగే కొన్ని శాతం పద్ధతుల్లో థియేటర్ల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారని కొన్ని న్యూస్ చానల్స్, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ పూర్తిగా తప్పుడు వార్తలేనని, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ  స్టేట్  ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (TSFCC) స్పష్టం చేసింది.
 
అలాగే, ఆంధ్రా మరియు తెలంగాణ ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశం మే 18, 2025న జరగనుందని, ఈ సమావేశంలో ఎగ్జిబిటర్ల కు సంబంధించి పలు సమస్యలపై చర్చిస్తామని అలాగే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై చర్చ జరగనున్నదని పేర్కొన్నారు. సమావేశం పూర్తైన తర్వాత అధికారిక సమాచారం అందించనున్నట్టు TSFCC స్పష్టం చేసింది. ఈ సందర్భంగా  తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ : సునీల్ నారంగ్,  సెక్రటరీ  కే. అనుపమ్ రెడ్డి లిఖితపూర్వకంగా తెలియజేశారు.