శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 23 ఆగస్టు 2018 (09:43 IST)

బాబాయ్‌తో యువతి ప్రేమ వివాహం.. గొంతుకోసి చంపేసిన తండ్రి...

తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలో పరువు హత్య జరిగింది. కనిపెంచిన కుమార్తె తమకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకోవడంతో ఆ తండ్రి జీర్ణించుకోలేక పోయాడు. దీంతో కత్తి తీసుకుని కుమార్తె గొంతు కోసి చ

తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలో పరువు హత్య జరిగింది. కనిపెంచిన కుమార్తె తమకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకోవడంతో ఆ తండ్రి జీర్ణించుకోలేక పోయాడు. దీంతో కత్తి తీసుకుని కుమార్తె గొంతు కోసి చంపేశాడు. ఈ దారుణం తెలంగాణా రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, అబ్దుల్లాపూర్ మెట్ ఎస్సీ కాలనీకి చెందిన విజయ అనే యువతి వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తిని నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ఈ దంపతులు ఊరి నుంచి దూరంగా వెళ్లి జీవిస్తున్నారు. ఈ క్రమంలో తన అత్త చనిపోవడంతో విజయ సొంత ఊరికి వచ్చింది. 
 
ఈ విషయం తెలుసుకున్న విజయ కుటుంబ సభ్యులు అక్కడకు వచ్చి ఆమెతో గొడవ పెట్టుకున్నారు. అయితే ఈ పెళ్లి వ్యవహారంతో ఊర్లో తన పరువు పోయిందని భావించిన తండ్రి విజయను కిరాతకంగా గొంతు కోసి హతమార్చాడు. కుమార్తె నిండు గర్భిణి అని కూడా చూడకుండా చంపేశాడు. ఆ తర్వాత పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు.