ఆదివారం, 15 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 30 మే 2018 (18:32 IST)

పవన్ కళ్యాణ్‌కు ప్రజల బ్రహ్మరథం.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? (Video)

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన పోరాట యాత్ర శ్రీకాకుళం జిల్లాలో బుధవారం ముగిసింది. ఈ యాత్రా సమయంలో పవన్‌కు ఆ జిల్లా వాసులు బ్రహ్మరథం పట్టారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు మార్పుకోరుకుంటున్నారా? అంటే అవు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన పోరాట యాత్ర శ్రీకాకుళం జిల్లాలో బుధవారం ముగిసింది. ఈ యాత్రా సమయంలో పవన్‌కు ఆ జిల్లా వాసులు బ్రహ్మరథం పట్టారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు మార్పుకోరుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నారు.. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి కన్వీనర్ మాదాసు గంగాధరం.
 
ఆయన బుధవారం హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... పవన్‌ కల్యాణ్‌ పవరేంటో తెలుసు కాబట్టే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆయన మద్దతు తీసుకుందని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన సత్తా చాటడం ఖాయమని, ప్రజలు పవన్‌పై సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారన్నారు. ఆయన మీడియా సమావేశం వీడియోను మీరూ చూడండి.