శనివారం, 1 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 17 డిశెంబరు 2016 (09:45 IST)

హైదరాబాద్ టెక్కీపై హత్యాయత్నం చేయించిన భర్త.. ఎందుకంటే...

హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ వివాహితపై కట్టుకున్న భర్తే హత్యాయత్నం చేయించాడు. ఇందుకోసం ఇద్దరు కిరాయి రౌడీలను నియమించి.. వారితో దాడి చేయించాడు. ఆ మహిళా టెక్కీ ఒంటరిగా రోడ్డుపై నడిచి వెళుతుంటే.. ఓ

హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ వివాహితపై కట్టుకున్న భర్తే హత్యాయత్నం చేయించాడు. ఇందుకోసం ఇద్దరు కిరాయి రౌడీలను నియమించి.. వారితో దాడి చేయించాడు. ఆ మహిళా టెక్కీ ఒంటరిగా రోడ్డుపై నడిచి వెళుతుంటే.. ఓ కిరాయి రౌడీ సీసాతో ఆమె తలపై కొట్టగా, మరొక కిరాయి రౌడీ కడుపులో కత్తితో పొడిచాడు. దీంతో ఆ టెక్కీ తీవ్రంగా గాయపడింది. హైదరాబాద్ చింతల్ ద్వారకాపురి కాలనీలో ఈ దారుణం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మహాలక్ష్మి అనే (23) అనే టెక్కీ నిజాం పేట ప్రాంతంలో నివసిస్తూ ఉద్యోగం చేస్తోంది. ఈమె సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆదిత్యను 2014లో ప్రేమించి వివాహం చేసుకుంది. కొంతకాలం సాఫీగా సాగిన వీరి సంసారంలో గొడవలు రావడంతో భర్తపై పేట్‌బషీరాబాద్‌ స్టేషన్‌లో కేసు పెట్టింది. వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో వేర్వేరుగా ఉంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో ద్వారాకాపురికాలనీలో అయ్యప్ప ఆలయానికెళ్లి వస్తున్న ఆమె వద్దకు ఇద్దరు వ్యక్తులు వెళ్లారు. నీ భర్త ఆదిత్యపై పెట్టిన కేసు ఉపసంహరించుకోవాలని ఆమె తలపై ఓ వ్యక్తి బాటిల్‌తో కొట్టాడు. మరో వ్యక్తి కత్తితో చేతిపై పొడవడంతో తీవ్రంగా గాయమవడంతో పరుగులు తీసింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. భర్తే హత్యాయత్నం చేయించాడని జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు.