1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 మే 2025 (16:35 IST)

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

latha rajinikanth
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎపుడు రిటైర్మెంట్ అవుతారంటూ వస్తున్న వార్తలపై ఆయన సతీమణి లతా రజనీకాంత్ స్పందించారు. ఈ ప్రశ్నకు తనకు సమాధానం చెపితే చెప్పేదాన్నని అన్నారు. ప్రస్తుతం రజనీకాంత్ 'కూలీ', 'జైలర్-2' వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత ఆయన సినిమాలకు స్వస్తి చెప్పనున్నారంటూ ప్రచారం సాగుతోంది. 
 
తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో మీ భర్త సినిమాల నుంచి విరామం తీసుకునే ఆలోనలో ఉన్నారా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దీనికి లతా రజనీకాంత్ సమాధానిస్తూ, ఆ ప్రశ్నకు సమాధానం నాకు తెలిస్తే బాగుండేది. తెలిస్తే ఖచ్చితంగా మీకు చెప్పేదాన్ని అని అన్నారు. ఆమె నేరుగా సమాధానం ఇవ్వకపోవడంతో రజనీకాంత్ భవిష్యత్ ప్రణాళికలపై నెలకొన్న సందిగ్ధత ప్రస్తుతానికి కొనసాగుతూనే ఉంది అని పేర్కొన్నారు. 
 
ఇదిలావుంటే, తలైవర్ నటనకు స్వస్తి పలుకనున్నారనే వార్తలు ఈ మధ్యకాలంలో ఊపందుకున్నాయి. ఈ వార్తలు ఆయన అభిమానులను కొంత ఆందోళనకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్ అర్ధాంగి పై విధంగా కామెంట్స్ చేయడం గమనార్హం.