అన్నతో మాట్లాడినా లింకులు పెట్టేస్తున్నారు.. రెండో పెళ్లి అంటూ ట్రోల్ చేస్తున్నారు... జాను వీడియో
ప్రముఖ డ్యాన్సర్ జాను లిరి ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఓ డ్యాన్స్ షోలో డ్యాన్సర్ జాను లిరిని ప్రముఖ కొరియోగ్రాఫర్, న్యాయ నిర్ణేతగా వ్యవహరించే శేఖర్ మాస్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఆ తర్వాత శేఖర్ మాస్టర్, జాను లిరిలపై ట్రోల్స్ మొదలయ్యాయి. వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
ఈ నేపథ్యంలో ఇటీవల శేఖర్ మాస్టర్ స్పందించి, తనకు జానుకు ఉన్న సంబంధంపై క్లారిటీ ఇచ్చారు. మహిళా డ్యాన్సర్ జాను విషయంలో తనని ఉద్దేశించి సోషల్ మీడియలా వస్తున్న కామెంట్స్ ఎంతగానో బాధిస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా జాను లిరి కూడా స్పందించారు. తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశారు తన వ్యక్తిగత జీవితంపై రకరకాలైన వార్తలు రావడంపై ఆమె బోరున విలపిస్తూ ఎమోషనల్ అయ్యారు. ఆ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.