'కింగ్‌డమ్' నుంచి వైల్డ్ పోస్టర్‌ను రిలీజ్ చేసి మేకర్స్
టాలీవుడ్ యంగ్ హీరో విజయే దేవరకొండ తాజాగా నటించిన చిత్రం "కింగ్‌డమ్". జాతీయ అవార్డు గ్రహీత గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. సితార ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇందులో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బొర్సో హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఈ మూవీలో రౌడీ బాయ్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, ఇంటెన్స్ టీటైలి టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి మరో వైల్డ్ పోస్టర్‌ను విడుదల చేసింది.
"కింగ్‌డమ్" మాసం పరిపాలించడానికి సిద్ధంగా ఉంది అనే క్యాప్షన్‌తో ఈ సరికొత్త పోస్టర్‌ను మేకర్స్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ చిత్రంపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ గంపెడాశలు పెట్టుకున్నారు.
ఇటీవలికాలంలో ఆయన నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో మంచి కంటెంట్‌తో వస్తున్న 'కింగ్‌డమ్'పై హీరోతో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా ఎన్నో ఆశలుపెట్టుకుంది.