1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 మే 2025 (18:10 IST)

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

varun lavanya
మెగా ఫ్యామిలీలోకి మరో వారసుడు రాబోతున్నాడనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు, సినీ హీరో వరుణ్ తేజ్, ఆయన సతీమణి, హీరోయిన్ లావణ్య త్రిపాఠిలు తల్లిదండ్రులు కాబోతున్నట్టు పుకార్లు వ్యాపించాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఈ జంట గత యేడాది ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీరిద్దరూ ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుండటంతో మెగా కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారన్న కథనాలు వస్తున్నాయి. అయితే, ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే మెగా ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది. ఏదేమైనప్పటికీ వరుణ్, లావణ్య త్రిపాఠి దంపతులకు మెగా ఫ్యామ్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 
 
మరోవైపు, వరుణ్ తేజ్ సినీ కెరీర్ విషయానికి వస్తే 2023లో ఆయన నటించిన 'గాండీవధారి అర్జున', 'ఆపరేషన్ వాలెంటైన్', 'మట్కా' చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయారు. ప్రస్తుతం ఆయన మేర్లపాటి గాంధీ దర్శకత్వంలో వీటీ 15 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రితికా నాయక్ హీరోయిన్.