1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 మే 2025 (13:51 IST)

ఓ విషయం మీద బలంగా రియాక్ట్ అవ్వాలని ఉంది... బన్నీ వాసు

bunny vas
టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు తాజాగా చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. "ఒక విషయం మీద గట్టిగా రియాక్ట్ అవ్వాలని ఉంది. అలాగే, ఎందుకిపుడు గొడవలు అని కూడా ఉంది. శాంతి, శాంతి, శాంతి" అని కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సింగిల్ సినిమా వివాదాన్ని ఉద్దేశించే ఆయన ఈ పోస్ట్ పెట్టారని పలువురు భావిస్తున్నారు. 
 
హీరోగా కేతికా శర్మ, ఇవానా కథానాయికలుగా నటించిన చిత్రం "సింగిల్". అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానరుపై ఈ సినిమా నిర్మతమైంది. ఫుల్‌కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఇందులో శ్రీవిష్ణు ఓ సన్నివేశంలో శివయ్యా అటూ డైలాగ్ చెప్పడం అంతటా వైరల్ అయింది. "కన్నప్ప" చిత్రాన్ని ట్రోల్ చేస్తూనే ఆయన ఈ డైలాగ్ చెప్పారని పలువురు కామెంట్స్ చేశారు. దీనిపై నెట్టింట వైరల్‌గా మారిన ఈ విషయంపై చిత్రబృందం క్షమాపణలు కూడా చెప్పింది.