1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : గురువారం, 1 మే 2025 (17:35 IST)

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

Chiru, mithun, hemamalini and others
Chiru, mithun, hemamalini and others
అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో  ఏర్పాటు చేసిన వేవ్స్ (WAVES వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్) సమ్మిట్‌‌లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. గురువారం (మే 1) నాడు ముంబైలో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో భారత చలన చిత్ర సీమకు సంబంధించిన ప్రముఖులు పాల్గోన్నారు. ఈ ఈవెంట్‌లో చిరంజీవి, అక్షయ్ కుమార్, రజినీకాంత్, మోహన్‌లాల్ వంటి వారు పాల్గొన్నారు. 
 
ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. ‘బాల్యంలో నేను ఎక్కువగా డ్యాన్సులు చేసి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌ను ఎంటర్టైన్ చేస్తుండేవాడిని. అలా నటనపై నాకు ఆసక్తి మొదలైంది. చివరకు మద్రాసుకి వెళ్లి ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాను. అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు గారు ఇలా అర డజనుకు పైగా స్టార్ హీరోలున్నారు. అలాంటి వారి మధ్య నాకు అసలు అవకాశం వస్తుందా? అని అనుకున్నాను. అందరి కంటే భిన్నంగా ఏం చేయగలను అని ఆలోచించాను. అప్పుడే ఫైట్స్, డ్యాన్స్ విషయంలో మరింత శిక్షణ తీసుకున్నాను. అవే ఇప్పుడు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. మేకప్ లేకుండా సహజంగా నటించడం మిథున్ చక్రవర్తి , స్టంట్స్ విషయంలో అమితాబ్, డ్యాన్స్ విషయంలో నా సీనియర్ కమల్ హాసన్ నాకు స్పూర్తిగా నిలిచారు. అందరినీ చూస్తూ, పరిశీలిస్తూ నన్ను నేను మల్చుకుంటూ ఈ స్థాయికి వచ్చాను’ అని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యఅతిథిగా విచ్చేశారు.