గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 జనవరి 2017 (10:21 IST)

సీఐగా ఉండి జీపు వాడొద్దు.. కుర్చీలో కూర్చోరాదు.. సీఐ భార్యగా అన్నీ చేయొచ్చా?

సిద్దిపేట పోలీసు కమిషనర్ శివకుమార్‌పై హుస్నాబాద్ సీఐ దాసరి భూమయ్య సంచలన ఆరోపణలు చేశారు. ‘‘యూనిఫాం వేసుకుని సీఐగా పని చేస్తున్న తాను ప్రభుత్వ పోలీసు జీపు వాడద్దని అంటున్నారు.

సిద్దిపేట పోలీసు కమిషనర్ శివకుమార్‌పై హుస్నాబాద్ సీఐ దాసరి భూమయ్య సంచలన ఆరోపణలు చేశారు. ‘‘యూనిఫాం వేసుకుని సీఐగా పని చేస్తున్న తాను ప్రభుత్వ పోలీసు జీపు వాడద్దని అంటున్నారు. సీపీ భార్య మాత్రం ప్రభుత్వానికి చెందిన టవెరాను ఉపయోగించవచ్చా అని ఆయన ప్రశ్నించారు. పైగా, ‘జీపు వాడొద్దు. కుర్చీలో కూర్చోవద్దు. స్టేషన్‌కు వెళ్లద్దు’ అంటూ నిబంధనలకు విరుద్ధంగా ఆంక్షలు విధిస్తూ వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. 
 
సీపీ శివకుమార్‌ వేధింపులను ఆయన మాట్లాడుతూ... 'నేను 20 రోజులుగా సిక్‌ లీవ్‌లో ఉన్నాను. విధుల్లో చేరేందుకు వస్తుండగా ‘నీకు బదిలీ అయింది. నువ్వు స్టేషన్‌కు వెళ్లద్దు. జీపు వాడొద్దు’ అంటూ ఏసీపీతో కమిషనర్‌ ఒత్తిడి తీసుకువచ్చాడు. నాకు బదిలీ ఆర్డర్‌ రాలేదు. ప్రొసీజర్‌ ప్రకారం, కొత్తగా వచ్చే సీఐకి చార్జి అప్పగించిపోతాను అన్నప్పటికీ నిరాకరించారు. ఇక్కడ ఉండవద్దంటూ మానసిక ఒత్తిడికి గురి చేశారు’’ అని వివరించారు. 
 
తనపై సీపీ కక్ష పెట్టుకోవడానికి కారణం తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన ఘటన అని తెలిపారు. ‘‘అప్పట్లో హైదరాబాద్‌లో జరిగిన ఒక సమావేశంలో జై తెలంగాణ అని నినాదాలు చేసిన కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ను యూనిఫాంలోలేని పోలీసులు కొట్టారు. దాంతో, పోలీస్‌ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న నేను అప్పటి డీజీపీకి వ్యతిరేకంగా మాట్లాడాను. అప్పుడు కరీంనగర్‌ ఎస్పీగా ఉన్న శివకుమార్‌ నాకు రెండు చార్జి మెమోలు ఇచ్చి సీఐడీకి బదిలీ చేయించారు. 
 
అలాగే, అమరుల భవన నిర్మాణ అవకతవకలపై ఆర్‌టీఐ కింద లెక్కలు అడిగాను. దీనికి నాపై కక్ష పెంచుకున్నాడు' అని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు చొరవతో తనకు మళ్లీ హుస్నాబాద్‌ సీఐగా బదిలీ అయిందని, విధుల్లో ఉండగానే ‘జీపు వాడొద్దు. కుర్చీలో కూర్చోవద్దు. స్టేషన్‌కు వెళ్లద్దు’ అంటూ నిబంధనలకు విరుద్ధంగా ఆంక్షలు విధించారని తెలిపారు. తన వద్దకు వచ్చి రిపోర్ట్‌ చేయాలని సీపీ ఆదేశించడమేమిటని ప్రశ్నించారు. 
 
'యూనిఫాం వేసుకున్న తాను జీపు వాడద్దని అంటున్నారు. సీపీ భార్య ప్రభుత్వానికి చెందిన టవెరాను ఉపయోగిస్తున్నారు. దానికి డ్రైవర్‌గా కోహెడ పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌ను వినియోగించుకున్నారు. ఇప్పుడు బెజ్జం స్టేషన్‌కి చెందిన కానిస్టేబుల్‌ టవేరా డ్రైవర్‌గా పని చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వారు ప్రభుత్వ వాహనం వాడితే తప్పుకాదు. కానీ, నేను సీనియర్‌ పోలీస్‌ ఉద్యోగిగా డ్యూటీలో ఉండి వాహనం వాడుకోవడం తప్పా!?' అని ప్రశ్నించారు.