శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 9 జులై 2019 (18:07 IST)

లాడ్జీకి తీసుకెళ్లి గొంతుకోశాడు...

హైదరాబాద్‌ నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో దారుణం జరిగింది. యువతిపై ఓ యువకుడు ఘాతుకానికి తెగబడ్డాడు. యువతిపై హత్యాయత్నం చేసిన తర్వాత యువకుడు వెంకటేష్‌ కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. 
 
ఈ వివరాల్లోకి వెళ్తే... మంగళవారం ఉదయం బృందావన్‌ లాడ్జీలోకి ఓ జంట అద్దెకు దిగింది. మధ్యాహ్నం వేళ యువకుడు చాకుతో యువతి గొంతు కోశాడు. యువతి గొంతుకోసిన తర్వాత వెంకటేశ్ కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. 
 
వెంకటేష్‌ది నెల్లూరు కాగా.. యువతి మనస్విని బడంగ్‌పేట్‌ వాసిగా గుర్తించారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యాయత్నానికి కారణమేంటో దర్యాప్తు చేస్తున్నారు.