గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 28 సెప్టెంబరు 2024 (12:22 IST)

నల్లవాగును కబ్జా చేసి వెంచర్ వేసిన వైకాపా నేత - హైడ్రా నోటీసులు

shilpa mohanreddy
ఏపీ మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో నల్లవాగును కబ్జా చేసి ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు. దీన్ని గుర్తించిన హైడ్రా అధికారులు ఆయనకు నోటీసులు జారీచేశారు. శిల్పా మోహన్ రెడ్డి సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నాగ్సన్‌పల్లిలోని నల్లవాగును ఆక్రమించి వెంచర్ వేసినట్టు హైడ్రా అధికారులను గుర్తించారు. ఇటీవల సర్వే చేపట్టిన అధికారులు వెంచర్‌లోని ఆక్రమణలను తొలగించే పనిలోకిదిగారు. 
 
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన శిల్పా మోహన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాజీ సీఎం దివంగత వైఎస్ఆర్ మంత్రివర్గంలో గృహ నిర్మాణ శాఖామంత్రిగా ఉన్నారు. ఆయన కుటుంబ వ్యాపాలన్నీ హైదరాబాద్‌లో ఉన్నాయి. ఇందులోభాగంగా, తెలంగాణాలో అనేక రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వేశారు. శిల్పా మోహన్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో నల్లవాగును ఆయన కబ్జా చేసి వెంచర్ వేసినట్టు తేలడంతో హైడ్రా అధికారులు ఆయనకు నోటీసులు జారీచేశారు.