ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 28 మే 2022 (13:39 IST)

ఎన్టీఆర్ గారికి నమస్కరిస్తున్నా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్

తెలుగు గడ్డపై జన్మించిన విశిష్ట వ్యక్తుల్లో ఎన్టీఆర్ గారు ఒకరనీ, అలాంటి అభ్యుదయవాది, ఎన్టీఆర్ కు నివాళులు అర్పిస్తున్నానంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయనకు తెలుగు భాషపై వున్న మక్కువ, పట్టు ఎంతగానో నన్ను ఆకట్టుకునేది, ఆయనకు మనస్పూర్తిగా నమస్కరిస్తున్నానంటూ పవన్ కల్యాణ్ అన్నారు.

 
వంద నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ
వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించాలన్న విషయంపై రిజర్వు బ్యాంకుతో సంప్రదింపులు చేస్తున్నట్లు ఎన్టీఆర్ కుమార్తె, మాజీ కేంద్రమంత్రి, భాజపా నాయకురాలు పురంధేశ్వరి చెప్పారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
 
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఈరోజు నుంచి వచ్చే ఏడాది మే 28 వరకూ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులను సత్కరించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేసామనీ, అందులో కె. రాఘవేంద్రరావు, బాలయ్య తదితరులు సభ్యులుగా వున్నట్లు వెల్లడించారు.