శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 28 మే 2022 (13:18 IST)

నానక్‌రాంగూడలోని హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం, చిక్కుకున్నవారు క్షేమం

fire accident
నానక్‌రాంగూడలోని ఓ ప్రముఖ హోటల్ అగ్నిప్రమాదానికి గురైంది. హోటల్లో భారీగా మంటలు ఎగసిపడి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మంటలు ఎగసిపడటంతో హోటల్ సిబ్బంది పరుగులు తీసారు.

 
ఈ ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాధమికంగా తేల్చారు. రెండో అంతస్తులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు రెండో అంతస్తు నుంచి మూడో అంతస్తుకి వ్యాపించాయి. అగ్నిమాపకదళం మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది.

 
కాగా దట్టమైన పొగ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.