గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 మే 2022 (09:15 IST)

అసలే ఆకలి.. ఆర్డర్ ఇచ్చిన బిర్యానీలో బల్లి.. ఎక్కడ?

Chicken Biryani
అసలే ఆకలి.. ఆర్డర్ ఇచ్చిన బిర్యానీలో బల్లి వుండటం చూసి ఓ వ్యక్తి షాకయ్యాడు. అంతే తిన్నదంతా వాంతులు చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. 
 
ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో ఉండే ఒక ప్రముఖ రెస్టారెంట్‌లో శుక్రవారం ఈ ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే...రాంనగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ రవిచారి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ఓ రెస్టారెంట్‌ నుంచి బిర్యానీ ఆర్డర్‌ చేశాడు. 
 
సగం బిర్యానీ తిన్న తర్వాత అందులో బల్లి కనిపించడంతో షాక్‌ అయ్యాడు. దీంతో కంగుతిన్న కార్పొరేటర్‌ చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
 
పోలీసులు బిర్యానీని టెస్టింగ్ కోసం ఫుడ్ కంట్రోల్ ల్యాబ్‌కు పంపించారు. అదే విధంగా ఫుడ్‌ ఇన్స్పెక్టర్‌ బిర్యానీ సెంటర్ వద్దకు చేరుకొని తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.