ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (18:35 IST)

అన్నయ్య గన్‌తో సూసైడ్ చేసుకోవాలనుకున్నా.. అన్నయ్య ఇడియట్ అని తిట్టాడు: పవన్

హార్వర్డ్ యూనివర్సిటీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తాను నక్సల్స్‌లో కలిసిపోతానని తన కుటుంబం భయపడేదని.. పవన్ వ్యాఖ్యానించారు. తాను యోగిని కావాలనుకున్నానని.. కానీ జీవితం

హార్వర్డ్ యూనివర్సిటీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తాను నక్సల్స్‌లో కలిసిపోతానని తన కుటుంబం భయపడేదని.. పవన్ వ్యాఖ్యానించారు. తాను యోగిని కావాలనుకున్నానని.. కానీ జీవితం ఎదైనా సాధించాలనే తపన ఉండాలని తన అన్నయ్య (చిరంజీవి) తిట్టి చెప్పడంతో తనకు జ్ఞానోదయం అయిందని పవన్ వ్యాఖ్యానించారు. తన అన్నయ్య ఇడియట్ అని పిలిచారని చెప్పారు.
 
సమాజాన్ని స్టడీ చేయడం తనకు చిన్నప్పటి నుంచి అలవాటన్నారు. ప్రస్తుత రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో చెప్పేదోకటి అధికారంలోకి వచ్చాక చేసేదొకటిగా ఉందని పవన్ అన్నారు. ఓ దశలో అన్నయ్య లైసెన్స్ గన్‌తో సూసైడ్ చేసుకోవాలనుకున్నానని పవన్ తెలిపారు.
 
మరోవైపు నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట కవితకు జనసేన పార్టీ అధ్యక్షడు పవన్‌కల్యాణ్‌ ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో మద్దతు తెలిపిన ఆమెకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పవన్‌ ఆదివారం ట్వీట్‌ చేశారు. 
 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సమస్యలు తీర్చడానికి సంఘీభావం చూపాలని, కలిసి పనిచేయాలని పవన్ పిలుపు నిచ్చారు. కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే మనం పడిపోతాం.. జైహింద్‌ అని పవన్‌ ట్వీట్‌ చేశారు.