గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 20 ఫిబ్రవరి 2020 (08:37 IST)

అవినీతి నిరూపిస్తే విషం తాగుతా: పేర్ని నాని

మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు సంబంధించి రూ.12 కోట్ల విలువైన అభివృద్ధి పనుల్లో అవినీతి జరిగిందన్న తెదేపా నేత కొల్లు రవీంద్ర విమర్శలపై మంత్రి పేర్ని వెంకట్రామయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

అవినీతిని నిరూపిస్తే తాను, తన అనుచరులు విషం తాగేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. ఐదేళ్ల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతిలో మునిగి తేలిన మాజీ మంత్రి కొల్లురవీంద్రకు తనను విమర్శించే నైతికత లేదని సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అన్నారు.

ఇటీవల మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు సంబంధించి రూ.12 కోట్ల విలువైన అభివృద్ధి పనుల విషయంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తోన్న రవీంద్ర వాటిని రుజువు చేయాలంటూ సవాల్‌ విసిరారు.

రాజకీయంగా తానుగానీ, తన అనుచరులు గానీ అవినీతికి పాల్పడ్డట్లు నిరూపిస్తే తాము విషం తాగి చనిపోయేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.