సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 15 ఫిబ్రవరి 2020 (13:14 IST)

తెలంగాణలో ఆరోగ్యశాఖ అవినీతిమయం: బీజేపీ

రాష్ట్రంలో కొవిడ్​-19 వైరస్ సోకకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు.

హైదరాబాద్​ చుట్టుపక్కల ఆసుపత్రులు కట్టిస్తానన్న సీఎం కేసీఆర్​...ఇప్పుడున్న ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందించడం లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఆరోగ్య శాఖ అవినీతి మయమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు.

ఇందుకు గాంధీ ఆసుపత్రి డాక్టర్ ఆరోపణలే ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. కొవిడ్-19 వైరస్ నివారణకు బీజేపీ ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమాన్ని నాంపల్లి పార్టీ కార్యాలయంలో లక్ష్మణ్ ప్రారంభించారు.

ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మందులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కొవిడ్-19 వైరస్​పై ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ధైర్యాన్ని ఇవ్వలేకపోతోందని ఆయన మండిపడ్డారు