ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 7 జనవరి 2021 (12:03 IST)

పశ్చిమగోదావరి జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రూరల్ మండలం చాటపర్రు రోడ్డులో ఉన్న సూర్యనారాయణ రైస్ మిల్లు  గోడౌన్ పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ వరదరాజులు ఆదేశాలతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు.

కొత్తూరు ప్రాంతానికి చెందిన కుమార్ అనే వ్యక్తి ఈ గోడను అద్దెకు తీసుకొని నగరంలోని పలు ప్రాంతాలలో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఈ గోడౌన్ కు చేర వేస్తున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సమాచారాన్ని సేకరించారు దీంతో ఆ గోడౌన్ పై అధికారులు దాడి చేశారు.

అక్కడ రేషన్ బియ్యాన్ని 25 కేజీలు పది కేజీల బస్తాలు గా నిర్వాహకుడు కుమార్ ప్యాకింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు వెంటనే అక్కడ ఉన్న 11 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు.

కుమార్ వద్ద గుమాస్తాగా పని చేస్తున్న ఎనికేపల్లి రమేష్ అనే వ్యక్తి నీ అదుపులోకి తీసుకొని అతనిపై నిర్వాహకుడు కుమార్పై కేసు నమోదు చేశారు ఈ దాడిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ విల్సన్ , రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.