సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 30 అక్టోబరు 2020 (08:40 IST)

పశ్చిమ గోదావరి జిల్లాలో అరుదైన కాకి

పూర్తిగా తెల్లని రంగులో ఉన్న అరుదైన కాకి పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలో సంచరిస్తూ స్థానికంగా ఉన్నవారిని విశేషంగా ఆకర్షిస్తోంది.

బయ్యనగూడెం గ్రామం దళితవాడలో ఈ తెల్లని కాకి కొద్ది రోజుల క్రితం ప్రత్యక్షమైనట్లు స్థానికుడు జొన్నకూటి పట్టియ్య తెలిపారు.

చిన్నపిల్లలు వేసే ఆహారాన్ని తింటూ ఇక్కడే ఉండిపోయిందని, వేళకు ఆహారం నీరు అందిస్తుండటంతో చిన్నారులతో కాకి మమేకమైపోయిందని చెప్ప్పారు.

ఎక్కడెక్కడో తిరుగుతూ ఆ కాకి పిల్లలు ఆడుకునే సమయానికి దళిత వాడలోకి వచ్చి వాళ్ళని ఆహ్లాద పరుస్తుందనిహొస్థానికులు చెబుతున్నారు.