మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 30 అక్టోబరు 2020 (07:48 IST)

రాష్ట్ర పండుగ‌గా మ‌హ‌ర్షి వాల్మీకి జ‌యంతి

మ‌హ‌ర్షి వాల్మీకి జ‌యంతిని అక్టోబ‌రు 31న రాష్ట్ర పండుగగా నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీచేసిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.యండి.ఇంతియాజ్ తెలిపారు.

ఈ మేర‌కు జిల్లాలోని అన్ని ప్ర‌భుత్వ శాఖ‌లు త‌మ ప‌రిధిలో కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ అధికారిక ఉత్స‌వంగా వాల్మీకి జ‌యంతిని జ‌రుపుకోవాల‌న్నారు.

అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల అధికారులు త‌మ ప‌రిధిలోని డివిజ‌న‌ల్‌, మండ‌ల‌, పంచాయ‌తీ, గ్రామ స్థాయి కార్యాల‌యాల్లో ఈ ఉత్స‌వం నిర్వ‌హించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు.