శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (12:43 IST)

ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం.. మంత్రులు కూడా ఆ పని చేయాల్సిందే..

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రజాసేవ నిమిత్తం మంత్రులు సచివాలయంలో అందుబాటులో ఉండాలంటూ జగన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలకు, అర్జీదారుల కొరకు ప్రతీ బుధవారం సెక్రటేరియేట్‌లో వారంతా హాజరు కావాలని జగన్ ఆదేశించారు. 
 
గతంలో జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ప్రతి మంగళవారం, బుధవారం విధిగా సచివాలయానికి రావాలని సీఎం ఆదేశించిన సంగతి విదితమే. అయితే దూరభారం, సంక్షేమ పథకాల దృష్ట్యా మంత్రులకు వెసులుబాటు కల్పిస్తూ వారంలో ఒక్క రోజు ఉంటే సరిపోతుందని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
 
ఇటీవలే అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి పలు పథకాలను ప్రారంభించిన ప్రజాసేవ కోసం మంత్రులను అందుబాటులోకి ఉంచాలని నిర్ణయించారు. వైసీపీ అధినేత సీఎం జగన్ కు ప్రజలు కట్టబెట్టింది మామూలు అధికారం కాదు.. ఏకంగా క్లీన్ స్వీప్ లాంటిదే. 
 
బలమైన టీడీపీని 23 సీట్లకే పరిమితం చేసి ఏకంగా 150మందికిపైగా ఎమ్మెల్యేలను జగన్‌కు కట్టబెట్టారు. అలా అధికారం కట్టబెట్టిన ప్రజల కోసం ప్రభుత్వం అండగా నిలవాలని.. ప్రజా సంక్షేమాల కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని సీఎం మంత్రులను రంగంలోకి దించారు.