సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 21 జులై 2024 (17:38 IST)

వైకాపా నేతలకు ర్యాబిస్ వ్యాక్సిన్ వేసి దారిలో పెడతాం : జనసేన నేత నాగబాబు

nagababu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన టీడీపీ - జనసేన - బీజేపీ సారథ్యంలో కొత్త ప్రభుత్వంపై రోజుకో రీతిలో పిచ్చికుక్కల తరహాలో మాట్లాడుతున్న వైకాపా నేతకు ర్యాబిస్ వ్యాక్సిన్లు వేసి అదుపులో పెడుతామని జనసేన పార్టీ నేత, సినీ నటుడు నాగబాబు ప్రకటించారు. ఆదివారం జనసేన పార్టీలో మృతి చెందిన జనసేన కార్యకర్తల సభ్యులకు జనసేన కేంద్ కార్యాలయంలో బీమా చెక్కుల పంపిణీ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు చెక్కులను అందజేశారు. కార్యకర్తలకు తన వంతుగా ఎంతో కొంత సాయం అందిస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. 
 
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులే అయ్యిందని, అపుడే వైకాపా వాళ్లు మొరగడం ప్రారంభించారని నాగబాబు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ఆయన జేబులో నుంచి పది రూపాయలు ఇవ్వలేదని, ఎంతసేపూ దోచుకోవడం, దాచుకోవడమే వారి పని అని నాగబాబు హెచ్చరించారు. తాము కనీసం ఆరు నెలలు అయినా వేచిచూశామని, వైకాపా వాళ్లు నెల రోజులకే కుక్కల్లా వెంటపడుతున్నారని విమర్శించారు. యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వేసి వారిని దారిలో పెడతామని అన్నారు. వైకాపా ప్రభుత్వం చేసిన ప్రతి పనికి సమాధానం చెప్పుకునే రోజు వస్తుందని, చేసిన అవినీతి, అక్రమాలకు చట్టపరంగా శిక్ష తప్పదని నాగబాబు హెచ్చరించారు.