సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 21 జూన్ 2024 (15:37 IST)

తోడబుట్టినవాడిగా నా గుండె ఆనందంతో నిండిపోయింది : మెగా బ్రదర్ నాగబాబు!

Nagababu
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా శుక్రవారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో ఆయన సోదరుడు, సినీ నటుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కుటుంబ సభ్యులు అసెంబ్లీలోని సందర్శకుల గ్యాలెరీలో ఉన్నారు. తన తమ్ముడు పవన్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడాన్ని ఆయన స్వయంగా వీక్షించారు. ఈ సందర్భంగహా నాగబాబు ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు.
 
'డిప్యూటీ సీఎం హోదాలో శాసనసభలో ప్రమాణస్వీకారం చేస్తున్నటువంటి తమ్ముడు పవన్ కల్యాణ్ని చూసి తన మనసు ఆనందంతో ఉప్పొంగిపోయిందని ఆయన ట్వీట్ చేశారు. 'తోడబుట్టిన వాడిగా, జనసేన కార్యకర్తగా మా నాయకుడి ప్రమాణస్వీకారం చూసి నా గుండె ఆనందంతో నిండిపోయింది. పవన్ కల్యాణ్ అసెంబ్లీకి వెళ్లాలి. 'పవన్ కల్యాణ్ అను నేను' అని ప్రమాణస్వీకారం చేయాలనేది పదేళ్ల నా కల. అసెంబ్లీకి రావడం గ్యాలరీలో కూర్చోవడం నాకిదే మొదటిసారి. నాకు ఎంతో థ్రిల్‌గా ఉంది. 
 
మా కుటుంబం అంతా కూటమిలో కల్యాణ్ బాబు ఘన విజయం సాధించినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉన్నారు. ఇంతటి అఖండ గెలుపునిచ్చిన ప్రతి ఒక్క ఓటరు నమ్మకాన్ని అనుక్షణం నిలబెట్టుకుంటాడు. తనకి కేటాయించిన అన్ని మంత్రిత్వ శాఖలకి నిజాయతీతో, నిష్పక్షపాతంగా అన్ని విధాల అంతఃకరణ శుద్ధితో న్యాయం చేస్తాడని నిర్భయంగా తెలియజేస్తున్నాను' అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.