గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 21 జూన్ 2024 (11:38 IST)

వార్డు మెంబర్ కూడా కాలేదు... నువ్వెంత, నీ బతుకెంత: పవన్ పైన మాజీ మంత్రి రోజా ఓల్డ్ వీడియో వైరల్

pawan kalyan and Roja
రాజకీయాలలో ఏదైనా జరగొచ్చు. ఓడలు బళ్లు, బళ్లు ఓడలు అవుతాయంటారు. అలాగే వుంటుంది రాజకీయాలలో పరిస్థితి. అధికారంలో వున్నప్పుడు రోజా మాట్లాడుతూ... రాజకీయాలలోకి వచ్చి 15 సంవత్సరాలవుతోంది. ఎమ్మెల్యే కాదు కదా కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు. నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత? అంటూ ప్రశ్నించారు.
 
ఆ ప్రశ్నకు సమాధానంగా ఈరోజు ఉపముఖ్యమంత్రి అయిన పవన్ కల్యాణ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే వీడియోను మెర్జ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ వీడియో మీరూ చూడండి.