శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 21 జూన్ 2024 (09:24 IST)

2029లో మళ్లీ మనదే అధికారం, ఇప్పుడు ప్రజలు మోసపోయారు: వైఎస్ జగన్

ys jagan
2029 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సింగిల్ డిజిట్ ఫలితాలు వస్తాయి. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు మోసపోయారు. ఆ విధంగా మోసపోయిన ప్రజలకు మనం వెన్నుదన్నుగా నిలవాలి. మనం ప్రజలకు ఎంతో మంచి చేసాము. గడప గడపలో మనం చేసిన మంచి వుంది. ప్రజల వద్దకు వెళ్లి భరోసానిద్దాం అంటూ మాజీ సీఎం జగన్ అన్నారు.
 
నిన్నరాత్రి జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఘోర ఓటమి పాలైన అభ్యర్థులకు మనోధైర్యం ఇచ్చే ప్రయత్నం చేసారాయన. ఓడిపోయాము అనే భావనను మనసు నుంచి తీసేయండి అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... డిసెంబరు నెల వరకు ఆగండి. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ సంపూర్ణంగా నెరవేర్చలేడు. వాళ్ల హనీమూన్ కాలం ముగిసిపోతుంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ప్రారంభమవుతుంది. అప్పుడు ప్రజలు నిజం తెలుసుకుంటారు.
 
మన పార్టీ కోసం కృషి చేసిన కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలవండి. ప్రజలు తిరిగి మన పార్టీని 2029లో అధికారాన్ని కట్టబెడతారు అంటూ చెప్పుకొచ్చారు జగన్.