1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 19 జూన్ 2024 (20:36 IST)

రుషికొండ ప్యాలెస్‌తో ప్రజలకు ఏంటి ఉపయోగం? సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి: వైఎస్ షర్మిల (video)

YS Sharmila
రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ''ఆ నిర్మాణాన్ని ప్రజల డబ్బుతో నిర్మించారంటే... అది క్షమించరానిదే అవుతుంది. ప్రజల డబ్బుతో నిర్మించామని అంటున్నారు కనుక ఆ నిర్మాణం వల్ల ప్రయోజనాలు ఏమిటి అన్నది ప్రజలకు తెలియాల్సి వుంది. దానివెనుక జరిగిన వాస్తవాలను వెలికి తీయాలంటే సిటింగ్ జడ్జితో విచారణ చేయించాలి.
 
ఒకవైపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వేల కోట్లు అప్పుల్లో మునిగి వుందని చెబుతున్న వైసిపి ఇలాంటి బాధ్యతారాహిత్యానికి ఎలా పాల్పడుతుంది. ప్రజాధనాన్ని ఎంతమాత్రం బాధ్యత లేకుండా ఇలా డబ్బు వృధా చేయడంపై విచారణ జరిపించాల్సిందే. తప్పు చేసినవారిని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు'' అంటూ చెప్పారు.