పవన్ కల్యాణ్ జోలికి వస్తే పరిణామాలు దారుణంగా ఉంటాయ్!
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలు తమ తీరు మార్చుకోకపోతే, పరిణామాలు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు జనసేన అమరావతి అధికార ప్రతినిధి మండలి రాజేషు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంత్రి పేర్ని నాని కాపు కులస్తులుకు, కాపు కులానికి వైఎస్ఆర్ పార్టీ నేతలు నాయకులు ఏం చేశారో చెప్పాలన్నారు.
మంత్రి పేర్ని నాని అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని సవాలు చేశారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ పేర్ని నానికి సరైన బుద్ధి చెబుతారన్నారు. విజయవాడలో పేర్ని నాని అవినీతి సొమ్ముతో పిన్నమనేని పాలి క్లినిక్ రోడ్లో ఫ్లాటు కొనుగోలు చేయలేదా అంటూ ప్రశ్నించారు. రవాణా శాఖ మంత్రిగా ఒక కంపెనీ వారు ఇచ్చిన డబ్బులు ఏం చేశారో చెప్పాలన్నారు. మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోలికి వస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు.
నీతులు చెప్పే పేర్ని నాని అవినీతికి అడ్డూ అదుపు లేదన్నారు. మచిలీపట్నం శాసనసభ్యుడిగా ఆ ప్రాంత అభివృద్ధి కి ఏం చేశారో చెప్పాలన్నారు. తాను పని చేయకపోగా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై నోటి దురుసు తగ్గించుకోకపోతే, భవిష్యత్తులో తగిన బుద్ధి చెబుతామన్నారు. మరో మంత్రి వెల్లంపల్లి బ్రోకర్ వేషాలు మానుకోవాలన్నారు. మంత్రుల లిస్ట్ లో ఈ సారి పేర్లు ఉంటాయో లేదో తెలియని వీరు, సీఎం జగన్ భజన చేస్తున్నారని అన్నారు.