బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 జనవరి 2017 (08:53 IST)

తనయుడికి ప్రేమతో... రూ.కోట్ల కారును బహుమతిగా ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే

ప్రజా ప్రజనిధుల ఆర్థికబలానికి ఇది మరో నిదర్శనం. సాధారణ ప్రజలు తమ పిల్లలకు కనీసం సైకిల్ కూడా కొనివ్వలేని ఈ రోజుల్లో... ఆ ప్రజా ప్రతినిధి మాత్రం తన కుమారుడికి ఏకంగా రూ.3.60 కోట్ల విలువ చేసే స్పోర్ట్స్ క

ప్రజా ప్రజనిధుల ఆర్థికబలానికి ఇది మరో నిదర్శనం. సాధారణ ప్రజలు తమ పిల్లలకు కనీసం సైకిల్ కూడా కొనివ్వలేని ఈ రోజుల్లో... ఆ ప్రజా ప్రతినిధి మాత్రం తన కుమారుడికి ఏకంగా రూ.3.60 కోట్ల విలువ చేసే స్పోర్ట్స్ కారును బహుమతిగా ఇచ్చారు. ఆ ప్రజాప్రతినిధి ఎవరో కాదు.. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థ అధినేత. అధికార టీడీపీకి చెందిన ప్రజా ప్రతినిధి. 
 
ఇటలీలో తయారైన ల్యాంబోగిని మోడల్‌కి చెందిన ఈ కారును ముంబై వరకు నౌకలోనూ.. అక్కడి నుంచి తాడిపత్రికి కంటైనర్‌లోనూ తెప్పించారు. తన చిరకాల కోరిక మేరకు ఈ కారును ఆయన కొనుగోలు చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఈ కారును నడపడానికి తన వయసు అనుకూలించడం లేదన్నారు. తన ముచ్చటను తనయుని ద్వారా తీర్చుకుంటున్నానని చెప్పారు.
 
రెండు సీట్ల సామర్థ్యం ఉన్న ఈ కారు ధర రూ.3.60 కోట్లు. గంటకు 320 కిలోమీటర్ల స్పీడుతో ప్రయాణిస్తుంది. లీటర్‌ పెట్రోల్‌కు 3 కిలోమీటర్ల మైలేజీ వస్తుందని జేసీ ప్రభాకర్ రెడ్డి వివరించారు. ఇంతకీ జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు ఎవరనే కదా.. ఆయన పేరు జేసీ అస్మిత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేని కారును అస్మిత్ రెడ్డి సొంతమంది తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి సెలవిస్తున్నారు.