మంగళవారం, 8 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: బుధవారం, 6 జులై 2016 (15:46 IST)

గుంటూరు జిల్లా కోర్టు చరిత్ర‌లో తొలి మ‌హిళా ప్ర‌ధాన న్యాయ‌మూర్తి

గుంటూరు: జిల్లా కోర్టు చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తున్న సి. సుమలతను గుంటూరు జిల్లాకు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జ

గుంటూరు: జిల్లా కోర్టు చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తున్న సి. సుమలతను గుంటూరు జిల్లాకు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా సుమలత చరిత్ర సృష్టించారు. 
 
1905లో గుంటూరులో తొలిసారిగా జిల్లా కోర్టులు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి జిల్లా ప్రధాన న్యాయమూర్తులుగా పురుషులే నియమితులవుతూ వచ్చారు. తొలిసారిగా ఒక మహిళా న్యాయమూర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సుమలత 9 ఏళ్ల క్రితం జూనియర్‌ జడ్జిగా నియమితులై తెనాలిలో రెండేళ్లు పని చేశారు. 
 
జూనియర్‌ సివిల్‌ జడ్జిగా పని చేస్తూనే జిల్లా జడ్జి నియామకాలకు హైకోర్టు నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఏడేళ్ల క్రితం అదనపు జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఆమెను గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేశారు. ఇన్‌చార్జిగా పని చేస్తున్న ఒకటో అదనపు జిల్లా జడ్జి గోపిచంద్‌ నుంచి బాధ్యతలు స్వీకరించాల్సిందిగా ఆదేశించారు.